Friday, 25 December 2015

దేవా నీత్యాగము

దేవా నీత్యాగము
మము రక్షించెను
పాపమునుండి విడిపించెను
దేవా నీ త్యాగము
మము బ్రతికించెను
ఇల సజీవులుగా మము నిలిపెను

సిలువను గెలిచిన సజీవుని త్యాగము,
విలువను తెలిపెను - పరిశుద్ధుని రక్తము..2
ముందే తెలియును - తన బలి యాగము
తెలిసే చేసెను స్వబలి దానము
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము - తలనే వంచెను
తనువే అర్పించెను...2 || దేవా|

మనకై మోసెను ఆ పాప భారము
మనిషై ఓర్చెను కల్వరి కఠినం, ఆ సిలువలో..
తండ్రి మాటకా మహిమ కుమారుడు తలనే
వంచెను బలిగా అర్పించెన్, 
తన సర్వము...2|| దేవా||

No comments:

Post a Comment