Sunday, 27 December 2015

నీ ధనము-నీ ఘనము-ప్రభు యేసుదే

    నీ ధనము-నీ ఘనము-ప్రభు యేసుదే 
    నీ దశమభాగము నీయ-వెనుదీతువా

1  ధరలోన ధనధాన్యముల నీయగా
    కరుణించి కాపాడి రక్షింపగా
    పరలోక నాథుండు నీకీయగా 
    మరి యేసు కొరకీయ వెనుదీతువా

2  పాడిపంటలు ప్రభువు నీకీయగా
    కూడు గుడ్డలు నీకు దయచేయగా 
    వేడంగ ప్రభు యేసు నామంబును
    గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా

3  వెలుగు నీడలు గాలి వర్షంబులు
    కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా 
    వెలిగించ ధరపైని ప్రభు నామము
    కలిమి కొలది ప్రభునకర్పించవా

4  కలిగించె సకలంబు సమృద్ధిగా 
    తొలగించె పలు బాధ భరితంబులు 
    బలియాయె నీ పాపముల కేసువే 
    చెలువంగ ప్రభుకీయ చింతింతువా

No comments:

Post a Comment