Sunday, 27 December 2015

కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను

    కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను
    నాకు సహాయ - మెక్కడ నుండి వచ్చును

1.    భూమి ఆకాశములను - సృజించిన
    యెహోవా వలన - సాయము కల్గున్‌ 

2. నీ పాదము తొట్రిల్ల - నీయడు
    నిన్ను కాపాడువాడు-కునుకడు ||కొండ||

3. ఇశ్రాయేలును కాచు - దేవుడు
    కునుకడు నిద్రపోడు-యెన్నడు  ||కొండ||

4. యెహోవాయే నిన్ను - కాపాడును
    నీ కుడి ప్రక్క నీడగా - నుండున్‌  ||కొండ||

5. పగటెండ - రాత్రి వెన్నెల - దెబ్బ
    నీకు తగులకుండ నిను-గాపాడున్‌ ||కొండ||

6. ఎట్టి అపాయము రా - కుండగను
    ఆయన నీ ప్రాణమును - గాపాడున్‌

7. ఇది మొదలుకొని నిత్యము నీ
    రాకపోకలందు నిను-గాపాడున్‌

No comments:

Post a Comment