Friday, 25 December 2015

ప్రేమామృత ధారల చిందిన మన

    ప్రేమామృత ధారల చిందిన మన
    యేసుకు సమమెవరు ఆ...ఆ..ఆ 
    ప్రేమయె తానై నిలచి
    ప్రేమవాక్కులనే బలికి
    ప్రేమతో ప్రాణము బెట్టి
    ప్రేమ నగరికి చనియే      ||ప్రేమ||

1.    నిశ్చలమైన ప్రేమజీవికి
    ఇలలో తావేది
    ప్రేమ ద్రోహులే గాని
    ప్రియమున జేరరు వాని
    చేరిన చెలికాడగురా
    సమయమిదే పరుగిడరా      ||ప్రేమ||

2    ఎంత ఘోర పాపాత్ములనైనా
    ప్రేమించును రారా 
    పాపభారముతో రారా
    పాదములపై బడరా
    పాపుల రక్షకుడేసు
    తప్పక నిన్ను రక్షించున్‌       ||ప్రేమ||

3    ఇంత గొప్ప రక్షణను
    నిర్లక్ష్యము చేసెదవేల
    రక్షణ దినమిదియేరా
    తక్షణమే కనుగొనరా
    ఇదియే దేవుని వరము
    ముదమారగ చేకొనుము                           ||ప్రేమ||

No comments:

Post a Comment