Sunday, 27 December 2015

ప్రార్థన వినెడి పావనుడా

    ప్రార్థన వినెడి పావనుడా
    ప్రార్థన మాకు నేర్పుమయా        ||ప్రార్థన||

1. శ్రేష్టమైన భావము గూర్చి
    శిష్య బృందముకు  నేర్పితివి
    పరముడ నిన్ను ప్రణుతించెదము
    పరలోక ప్రార్థన నేర్పుమయ్యా  ||పార్థన||

2. పరమ దేవుడవని తెలిసి
    కరము లెత్తి జంటగ మోడ్చి
    శిరమునువంచి సరిగను వేడిన
    సుంకరి ప్రార్థన నేర్పుమయా  ||పార్థన||

3. దినదినంబు చేసిన సేవ
    దైవ చిత్తముకు సరిపోవ
    దీనుడవయ్యు దిటముగ కొండను
    చేసిన ప్రార్థన నేర్పుమయా       ||పార్థన||

4. శత్రుమూక నిను చుట్టుకొని
    సిలువపైని నిను జంపగను
    శాంతముతో నీ శత్రుల బ్రోవగ
    సలిపిన ప్రార్థన నేర్పుమయా  ||పార్థన||

No comments:

Post a Comment