Sunday, 27 December 2015

నాదు జీవమాయనే నా సమస్తము

    నాదు జీవమాయనే నా సమస్తము
    నా సర్వస్వము యేసుకే నాదు జీవము
    నాదు దైవము దివి దివ్య తేజము ||నా||

1  కృంగిన వేళ భంగపడినవేళ
    అద్దరికి చేర్చెను
    చుక్కాని లేని నావవలె
    నేనుండ అద్దరికి చేర్చెను
    ఆత్మతో నింపెను
    ఆలోచన చేసెను        ||నాదు||

2  సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
    విడిపించే శ్రీ యేసుడే
    రక్తమంత కార్చి
    ప్రాణాన్ని బలిచేసి
    విమోచన దయచేసెను
    సాతానుని అణగద్రొక్క 
    అధికార బలమిచ్చెను       ||నాదు||

3  కారు మేఘాలే క్రమ్మిన వేళ
    నీతీ సూర్యుడు నడుపును
    తుఫానులెన్నో చెలరేగి లేచిన
    నడువును నా జీవితనావ
    త్వరలో దిగివచ్చును
    తరలిపోదుము ప్రభునితో       ||నాదు||

No comments:

Post a Comment