Sunday, 27 December 2015

ఇదిగో మీ రాజు-ఏతెంచుచున్నాడు

    ఇదిగో మీ రాజు-ఏతెంచుచున్నాడు
    మీ తలలెత్తుడి
    సమీపమాయె-మీ విడుదల
    ధైర్యము నొందుడి

1.    యుద్ధములు కలహములు వైరములు 
    నిందలు హింసలు అపవాదులు   
    అంతము వరకు సూచనలివియే
    మేల్కొని యుండుము         ||ఇది||

2.    అక్రమము అవినీతి-ప్రబలును
    అందరి ప్రేమలు చల్లారును   
    అంతము వరకు కాపాడు కొమ్ము 
    మొదటి ప్రేమను          ||ఇది||

3.    చిగురించుచున్నది అంజూరము
    ఏతెంచియున్నది వసంతము
    ఉరి యొచ్చునట్లు అందరిపైకి 
    అంతము వచ్చును         ||ఇది||

4.    ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు
    మత్తును చింతను వీడుము
    విశ్వాస ప్రేమ నిరీక్షణల్‌
    ధరించియుండుము         ||ఇది||

1 comment: