Sunday, 27 December 2015

నన్నెంతగానో ప్రేమించెను

    నన్నెంతగానో ప్రేమించెను
    నన్నెంతగానో కరుణించెను
    నా యేసుడు నా పాపము     నా శాపము 
    తొలగించెను నన్ను కరుణించెను (2)

1.    సాతాను బంధాలలో
    జీవపు డంబాలలో
    పడనీయక దరి చేరనీయక   
    తన కృపలో నిరతంబు నను నిల్పెను

2.    సత్యంబు జీవంబును
    ఈ బ్రతుకు సాఫల్యము
    నేర్పించెను నాకు చూపించెను 
    వర్ణించగా లేను ఆ ప్రభువును   

3.    కల్వరిగిరి పైనను
    ఆ సిల్వ మరణమును
    నాకోసమే ప్రభు శ్రమ పొందెను
    నా పాపమంతటిని క్షమియించెను   

1 comment: