భజన చేయుచు భక్త పాలక
ప్రస్తుతింతు నీ నామమును
వృజినములపై జయము నిచ్చిన
విజయుడా నిను వేడుకొందు ||భజన||
1 దివ్యపదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు
భవ్యమైన బోధలెన్నో బాగుగా
ధర నేర్పినావు ||భజన||
2 నరులగావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు
పరుడనైన నాకొరకు నీ
ప్రాణము నర్పించినావు ||భజన||
3 చెడినవాడనైన నన్ను
జేరదీసి బ్రోచినావు
పడిన నాదు గోతి నుండి
పైకి లేవనెత్తినావు ||భజన||
4 ఎంత ప్రేమ యెంత దయ
ఎంత కృప యేసయ్య నీకు
ఇంతయని వర్ణింప నిలలో
నెవరికిని సాధ్యంబు కాదు ||భజన||
ప్రస్తుతింతు నీ నామమును
వృజినములపై జయము నిచ్చిన
విజయుడా నిను వేడుకొందు ||భజన||
1 దివ్యపదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు
భవ్యమైన బోధలెన్నో బాగుగా
ధర నేర్పినావు ||భజన||
2 నరులగావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు
పరుడనైన నాకొరకు నీ
ప్రాణము నర్పించినావు ||భజన||
3 చెడినవాడనైన నన్ను
జేరదీసి బ్రోచినావు
పడిన నాదు గోతి నుండి
పైకి లేవనెత్తినావు ||భజన||
4 ఎంత ప్రేమ యెంత దయ
ఎంత కృప యేసయ్య నీకు
ఇంతయని వర్ణింప నిలలో
నెవరికిని సాధ్యంబు కాదు ||భజన||
No comments:
Post a Comment