Friday, 25 December 2015

యెహోవాను గానము

    యెహోవాను గానము
    చేసెదము ఏకముగా
    మనకు రక్షకుడాయెను 
    ఆయన మహిమ పాడెదము   
    ఆయనను వర్ణించెదము
    ఆయనే  దేవుడు మనకు

1.    యుద్ధశూరు డెహోవా 
    నా బలము నా గానము
    నా పితరుల దేవుడు
    ఆయన పేరు యెహోవా  ||యెహోవా||

2.    ఫరో రథముల సేనలను
    తన శ్రేష్ఠాధి పతులను    
    ఎఱ్ఱసముద్రములోన 
    ముంచివేసె నెహోవా     ||యెహోవా||

3.         నీ మహిమాతిశయమున
    కోపాగ్ని రగులజేసి
    చెత్తవలె దహించెదవు
    నీపై లేచువారిని         ||యెహోవా||

4.    దోపుడు సొమ్ము పంచుకొని 
    ఆశ తీర్చుకొందును
    నా కత్తి దూసెదను
    అని శత్రువనుకొనెను    ||యెహోవా||

5.    వేల్పులలో నీ సముడెవడు
    పరిశుద్ధ మహనీయుడా
    అద్భుతమైన పూజ్యుండా 
    నీ వంటి వాడెవడు?     ||యెహోవా||

6.    ఇశ్రాయేలీయులంతా 
    ఎంతో సురక్షితముగా
    సముద్రము మధ్యను 
    ఆరిన నేలను నడిచిరి    ||యెహోవా||

22 comments:

  1. ఆమేన్

    ReplyDelete
  2. ఆమేన్

    ReplyDelete
  3. G David Shanth Raj
    Amen

    ReplyDelete
  4. హల్లెలూయా హల్లెలూయాస్తుతించి పాడి కీర్తింతును lyrics

    ReplyDelete
  5. యెహోవా

    ReplyDelete
  6. God bless you

    ReplyDelete
  7. Praise the lord

    ReplyDelete
  8. Glory to God in highest places

    ReplyDelete
  9. Very Nice Song

    ReplyDelete