Sunday, 27 December 2015

కల్వరి ప్రేమ తలంచునపుడు

    కల్వరి ప్రేమ తలంచునపుడు 
    కలుగుచున్నది దుఃఖం
    ప్రభువా నీ శ్రమలను
    ధ్యానించినపుడు
    పగులు చున్నది హృదయం

1  గెత్సెమనె అను తోటలో 
    విలపించుచు ప్రార్థించు ధ్వని 
    నలువైపుల వినబడుచున్నది 
    పగులుచున్నవి మా హృదయములు
    కలుగుచున్నది దుఃఖం       ||కల్వరి||

2  సిలువపై నలుగగొట్టినను
    అనేక నిందలు మోపినను
    ప్రేమతో వారిమన్నింపునకై
    ప్రార్థించిన ప్రియ యేసు రాజా
    నీ ప్రేమ పొగడెదము       ||కల్వరి||

3  మమ్మును నీ వలె మార్చుటకై
    నీ జీవమును ఇచ్చితివే
    నేలమట్టుకు తగ్గించుకొని
    సమర్పించితివి నీ కరములతో
    మమ్మును నడిపించుము        ||కల్వరి||

1 comment:

  1. It's a nice song which explains Christs suffering and longing of His children when meditate Him.

    ReplyDelete