Friday, 25 December 2015

ఆనందం మహానందం

    ఆనందం మహానందం
    నా ప్రియుని స్వరం మధురం
    ముఖము మనోహరం - ప్రియుని 
    ముఖము మనోహరం

1    నశియించిన పాపిని  నాకు
    శాశ్వతమైన కృప జూపి
    నా యేసుడెగా రక్షించెనుగా
    నా ప్రభువును సేవింతునుగా  ||ఆనం||

2    వేడుకతో విందుశాలకును
    తోడుకు వెళ్లును నా ప్రియుడు
    కోరిన ఫలములు తినిపించును
    కూరిమితో నా ప్రియ ప్రభువు  ||ఆనం||

3    ఆనందభరితనై నేను
    అతని నీడను కూర్చుందును
    వాడ బారను యే నాటికి నే
    వరదుని బాడుచు నుండెదను ||ఆనం||

4    ఎంతో ప్రేమతో ప్రేమించె
    వింతగను ప్రభు దీవించె
    అంతము వరకు యేసుని చెంతనే
    నుందును ఆనందముతోను   ||ఆనం||

5    రాజగు యేసు వచ్చునుగా
    రాజ్యము నాకు తెచ్చునుగా
    రాజ్యమునందు నే రాణినిగా
    రమ్యము గా నే నుందునుగా ||ఆనం||

10 comments: