Friday, 25 December 2015

యేసులో హర్షించెదము

    యేసులో హర్షించెదము 
    మహిమలో హర్షింతుము నిరతరం    
    మహిమ మహిమ మహిమలో 
    హర్షించెదము

1  పరిశుద్ధులుహర్షింప యేసు
    త్వరగా రమ్మని పలుక
    మారువారికి శిఖరం
    మనస్సారగ దేవుడిచ్చున్‌
    మహిమ ఘనము మహిమలో 
    నానందింప    ||యేసులో||

2  శుద్ధ జీవులైన
    దేవసుతులు ప్రకాశింపన్‌ 
    సర్వసృష్టి యొక్క    
    మహకర్మములన్నియు తీర
    రాజుకు మహిమ
    కలుగుదినములు రాగా     ||యేసులో||

3  స్ఫటిక జీవనదియు
    ఇరుప్రక్కల జీవ వృక్షమును
    ఆకలిదప్పులు లేక 
    నట జీవఫలముల భుజించి
    తినుచు త్రాగుచు
    యేసులో నానందింప    ||యేసులో||

4  పరిశుద్ధాత్మయు, సుతుడు చేసిన    
    రక్షణ కార్యమును
    తండ్రి దూతల గణముల్‌ నట జూచి 
    ప్రహర్షింపన్‌ క్రొత ్తకార్యము
    కొరకు ఆనందింప    ||యేసులో||

No comments:

Post a Comment