Friday, 25 December 2015

సువార్తను చాటింప

    సువార్తను చాటింప
    సుసమయం బిదియేను
    శ్రీయేసుని నామంబు
    ఎంతో మధురము మనకు

1  సంతసమున సాగెదము
    పురికొల్పుచు మనసులను 
    సంకటములు ఎన్నయిన
    చనిపోవుటె మేలనుచు     ||సువార్త||

2.  సిలువను మోయుచు భుజమున్‌ 
    చేత సువార్తల బూని
    లోకమునకు చాటెదము
    ప్రశాంతుండగు యేసున్‌    ||సువార్త||

3  శ్రీ యేసునికే యిలలో
    జయమార్భటించెదము
    జయశాలులుగా మేము
    జగదేవత నొణికింతుం     ||సువార్త||

4  ప్రవక్తలలో ఘనుడు
    పరమున దూతలు బొగడున్‌ 
    నేత్రముల కాయన తార
    అరుణోదయ నక్షత్రం     ||సువార్త||

5  చిరునగవులతో మేము
    చిందింతుము రక్తమును 
    హృదయములు ప్రకాశించున్‌
    మనసానందం బిదియే            ||సువార్త||

No comments:

Post a Comment