Monday, 28 December 2015

యెహోవ గద్దె ముందట

1. యెహోవ గద్దె ముందట
    జనంబూలార మ్రొక్కుడి
    యెహోవ దేవుడే సుమీ
    సృజింప జంప గర్తయే

2. స్వశక్తిచేత నాయనే
    మమున్‌ సృజించె మట్టిచే
    భ్రమించు గొఱ్ఱె రీతిగా
    దప్పంగ మళ్లి చేర్చెను

3. సుకీర్తి పాడి గుంపులై
    ప్రసిద్ధిచేతు మాయనన్‌
    జగత్తు వేయి నోళ్లతో
    స్తుతించు దివ్యమౌ ధ్వనిన్‌

4. ప్రభుత్వ ముండు నంతకున్‌
    ఆగున్‌ నీ ప్రేమ నిత్యము
    చిరంబు నీదు సత్యము
    వసించు నెల్లకాలము.

1. Yehōva gadde mundaṭa
    janambūlāra mrokkuḍi
    yehōva dēvuḍē sumī
    sr̥jimpa jampa gartayē
   
2. Svaśakticēta nāyanē
    mamun‌ sr̥jin̄ce maṭṭicē
    bhramin̄cu goṟṟe rītigā
    dappaṅga maḷli cērcenu
   
3. Sukīrti pāḍi gumpulai
    prasid'dhicētu māyanan‌
    jagattu vēyi nōḷlatō
    stutin̄cu divyamau dhvanin‌
   
4. Prabhutva muṇḍu nantakun‌
    āgun‌ nī prēma nityamu
    cirambu nīdu satyamu
    vasin̄cu nellakālamu.
   

No comments:

Post a Comment