Friday, 25 December 2015

యేసుని కొరకై - యిల జీవించెద

    యేసుని కొరకై - యిల జీవించెద 
    భాసురముగ నే ననుదినము
    దోషములన్నియు బాపెను మోక్ష 
    నివాసమున ప్రభు జేర్చునుగా 

1    నాశనకరమగు గుంటలో నుండియు 
    మోసకరంబగు యూబి నుండి
    నాశచే నిలపై కెత్తెను నన్ను  పి-శాచి 
    పథంబున దొలగించెన్‌            

2    పలువిధముల పాపంబును జేసితి
    వలదని త్రోసితి వాక్యమును
    కలుషము బాపెను కరుణను బిలచెను 
    సిలువలో నన్నాకర్షించెన్‌         

3    అలయక సొలయక సాగిపోదును
    వెలయగ నా ప్రభు మార్గములన్‌    
    కలిగెను నెమ్మది కలువరి గిరిలో
    విలువగు రక్తము చిందించిన ప్రభు      

4    శోధన బాధలు శ్రమలు గల్గిన
    ఆదుకొనును నా ప్రభు వనిశం
    వ్యాధులు లేములు మరణము వచ్చిన 
    నాథుడే నా నిరీక్షణగున్‌      

5    బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు
    గుప్తమైయున్నవి ప్రభునందు
    అద్భుతముగ ప్రభు వన్నియు నొసగి
    దిద్దును నా బ్రతుకంతటిని   

6    అర్పించెను తన ప్రాణము నాకై
    రక్షించెను నా ప్రియ ప్రభువు
    అర్పింతును నా యావజ్జీవము
    రక్షకుడేసుని సేవింప         

7    ప్రభునం దానం దింతును నిరతము
    ప్రార్థన విజ్ఞాపనములతో 
    విభుడే     తీర్చును యిల నా చింతలు
    అభయముతో స్తుతియింతు ప్రభున్‌   
8    యౌవన జనమా యిదియే సమయము 
    యేసుని చాటను రారండు
    పావన నామము - పరిశుద్ధ నామము 
    జీవపు మార్గము ప్రచురింప  

17 comments:

  1. I love this song

    ReplyDelete
  2. Super,🙏👌👌🙏

    ReplyDelete
  3. Pranamunu thepparilla cheyu Jeevamugala song idi

    ReplyDelete
  4. Praised the Lord

    ReplyDelete
  5. మన జీవితం లో ఎలా వెళ్లాలో మనకు గుర్తు చేసే కీర్తన.
    దేవునికి వందనాలు.

    ReplyDelete
  6. నైస్ సాంగ్

    ReplyDelete
  7. God bless you

    ReplyDelete
  8. గ్రేట్ సాంగ్

    ReplyDelete
  9. Okkokka strange extraordinary

    ReplyDelete
  10. This song is from Andhra christian hymns

    ReplyDelete
  11. Very nice song

    ReplyDelete