Sunday, 27 December 2015

నీ రక్తమే జయం - కల్వరి యేసు

    నీ రక్తమే జయం - కల్వరి యేసు
    కరుణ యేసు - నీ రక్తమే జయం

1    పాపాన్ని కడిగిన రక్తమే జయం
    శాపాన్ని మాపిన రక్తమే జయం
    పరిశుద్ధ పరచిన రక్తమే జయం
    శాంతిని నొసగిన రక్తమే జయం

2    విడుదల నిచ్చిన రక్తమే జయం
    కొరతలు తీర్చిన రక్తమే జయం
    జయము నిచ్చిన రక్తమే జయం
    బలము నొసగిన రక్తమే జయం

3    ద్వేషము తీర్చిన రక్తమే జయం
    ప్రేమతో నింపిన రక్తమే జయం
    అధికారమొసగిన రక్తమే జయం
    ఆశ్రయదుర్గమైన రక్తమే జయం

4    సాతానుని బంధించిన రక్తమే జయం
    నా కోసము క్రయమైన రక్తమే జయం
    సందేహము తీర్చిన రక్తమే జయం
     పరలోక మార్గమైన రక్తమే జయం

No comments:

Post a Comment