Sunday, 27 December 2015

క్రీస్తు మన కొరకు చనిపోయెను

    క్రీస్తు మన కొరకు చనిపోయెను
    యుక్త కాలమున మరణమాయెను 
    మనుషులందరి కొరకు
    పాప క్షమాపణకు 
    సిలువలో బలిగా మారెను    ||క్రీస్తు||

1    మనమింక బలహీనులమై యుండగా
    సోలి తూలి గాలికి కొట్టుకు పోగా
    సిలువలో మన కొరకు బలియాయెను
    మనలను బలవంతులుగా మార్చెను

2    మనమింక భక్తి హీనులమై యుండగా
    తండ్రి రాజ్యమునకు దూరమవ్వగా
    ఆయనె మనల ప్రేమించెను
    ప్రాణమునె దానము బలి యిచ్చెను

3    మనమింక పాపులమై బ్రతికి యుండగా
    దేవుని ఉగ్రతలో నిలిచి యుండగా
    పాపమునకు ప్రాణమును ధారపోసెను
    పాపపు రుణము తీర్చి వేసెను

No comments:

Post a Comment