Friday, 25 December 2015

యేసు పరిశుద్ధ నామమునకు

    యేసు పరిశుద్ధ నామమునకు  
    ఎప్పుడు అధిక స్తోత్రమే

1. ఇహపరమున మేలైన నామము  
    శక్తి గలిగి నట్టి నామమిది
    పరిశుద్ధులు స్తుతించు నామమిది  
    పరి...                     ||యేసు||

2. సైతానున్‌ - పాతాళమును జయించు 
    వీరత్వము గల నామమిది
    జయమొందెదము ఈ నామమున 
    జయ...                   ||యేసు||

3. నశించు పాపుల రక్షింప లోక 
    మున కేతెంచిన నామమిది
    పరలోకమున చేర్చు నామమిది  
    పర...                     ||యేసు||

4. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు  
    ఉన్నత దేవుని నామమిది
    లోకమంతా ప్రకాశించు నామమిది 
    లోక...                       ||యేసు||

5. శోధన గాధల కష్ట సమయాన 
    ఓదార్చి    నడుపు నామమిది
    ఆటంకము తీసివేయు నామమిది  
    ఆటం...                  ||యేసు||

No comments:

Post a Comment