Sunday, 27 December 2015

క్రీస్తు యేసు నాదు రాజా!

    క్రీస్తు యేసు నాదు రాజా! 
    నీ సిలువే నా మహిమ (2) 
    రమ్యమైనవి భూమి మీద 
    ఎంత యధికముగా నుండినను||క్రీస్తు||

1  మిగుల ఆస్థి - అధిక విద్య
    పలుకుబడి ఎంతో ఉండినను
    సిలువన్‌ జూడ - నాదు సర్వ 
    గర్వమంతయు వ్యర్థంబేను    ||క్రీస్తు||

2  జీవపూట - నీదు సిలువ
    జీవనది లోక మంతటికి
    శుద్ధ రక్త - ఊటలోన
    మునిగి నేను - శుద్ధుడనైతిన్‌   ||క్రీస్తు||

3  కాలు సేతుల్‌ - శిరము నుండి
    చిందుచుండె రక్తంబదిగో
    యేసు రాజా! ఇట్టి ప్రేమ
    నాదు బ్రతుకున గాంచలేదు   ||క్రీస్తు||

4  ఇంత వింత ప్రేమ కొరకై
    యేమి కానుక చెల్లించెదను
    కోటి యాస్తుల్‌ సాటి కావు
    నన్ను నేను సమర్పింతు        ||క్రీస్తు||

No comments:

Post a Comment