Sunday, 27 December 2015

సిలువ చెంత చేరిననాడే

    సిలువ చెంత చేరిననాడే
    కలుషములను కడిగివేయున్‌
    పౌలు వలెను-సీల వలెను
    సిద్ధపడిన భక్తుల జూచి

1  కొండాలాంటి బండాలాంటి
    మొండి హృదయంబు మండించు
    పండియున్న పాపులనైన
    పిలచుచుండె పరము జేర   ||సిలువ||

2  వంద గొఱ్ఱెల మందలో నుండి
    ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబది తొమ్మిది గొఱ్ఱెల విడిచి
    ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్‌ ||సిలువ||

3  తప్పిపోయిన కుమారుండు
    తండ్రిని విడచి తరలిపోయె 
    తప్పు తెలసి తిరిగి రాగా
    తండ్రి యతని చేర్చుకొనెను  ||సిలువ||

4  పాపి రావా పాపము విడిచి
    పరిశుద్ధుల విందులో జేర
    పాపుల గతిని పరికించితివా
    పాతాళంబే వారి యంతము  ||సిలువ||

No comments:

Post a Comment