దాసుల ప్రార్థన
దప్పక యొసగెడు
యేసునాయకుడె మా వేల్పు
దోసములు సేయు దుర్జనుడైనను
దోసిలొగ్గబరవాసి జేయునట
1. జన రహిత స్థల-మున జని వేడెడి
మనుజుల ప్రార్థన వినుచుండున్
తన పాదమునమ్మిన సాధూత్తమ
జనులను జూచిన సంతసమిడునట
2. మది విశ్వాసము-గూడిన ప్రార్థన
సదయత వినుటకు-జెవులొగ్గున్
హృదయము కనుగొని
యుచిత సమయమున-గుదురుగ
భక్తుల-కోర్కెలిచ్చునట
3. ముదమున నిద్దరు-ముగ్గురు నొకచో
బదిలముగా దను బ్రార్థింపన్
వదలక దానట-వచ్చి యుందు నని
మృదువుగ బలికిన కృత రక్షణుడట
దప్పక యొసగెడు
యేసునాయకుడె మా వేల్పు
దోసములు సేయు దుర్జనుడైనను
దోసిలొగ్గబరవాసి జేయునట
1. జన రహిత స్థల-మున జని వేడెడి
మనుజుల ప్రార్థన వినుచుండున్
తన పాదమునమ్మిన సాధూత్తమ
జనులను జూచిన సంతసమిడునట
2. మది విశ్వాసము-గూడిన ప్రార్థన
సదయత వినుటకు-జెవులొగ్గున్
హృదయము కనుగొని
యుచిత సమయమున-గుదురుగ
భక్తుల-కోర్కెలిచ్చునట
3. ముదమున నిద్దరు-ముగ్గురు నొకచో
బదిలముగా దను బ్రార్థింపన్
వదలక దానట-వచ్చి యుందు నని
మృదువుగ బలికిన కృత రక్షణుడట
No comments:
Post a Comment