Sunday, 27 December 2015

బెత్లెహేములో పుట్టెనేసు

    బెత్లెహేములో పుట్టెనేసు
    స్తుతియించుము మనసా - నేడే (2)

1.    సర్వమును సృష్టించిన - సృష్టికర్తయే 
    తానే తాలిమితో తల్లి ఒడిలో 
    తలనాన్చెను         ||బెత్లె||

2.    సింహాసనా సీనుడైన దేవపుత్రుడే తానే
    పసివానిగ పశుల తొట్టిలో 
    పవళించెను          ||బెత్లె||

3.    లేఖనములు చెప్పినట్లు- నెరవేర్చుటకై 
    తానే మోక్షం వీడి దీనునిగా
    దిగివచ్చెను                  ||బెత్లె||

4.    పరలోక దూతలతో - పరవశించెను
    తానే మన కొరకే పశుల పాకలో
    జనియించెను               ||బెత్లె||

5.    ఇంత గొప్ప ప్రేమ చూపినా యేసుని 
    మనం సంతసముగ కలసి వెళ్లి
    స్తుతియించెదం         ||బెత్లె||

No comments:

Post a Comment