Friday, 25 December 2015

లేచినాడురా సమాధి గెలిచినాడురా

    లేచినాడురా సమాధి గెలిచినాడురా 
    యేసు లేతునని తాఁజెప్పినట్లు
    లేఖనములో పలికినట్లు

1    భద్రముగ సమాధిపైన
    పెద్దరాతిని యుంచిరి భటులు
    ముద్రవేసి రాత్రియంత
    నిద్ర లేక కావలియున్న         ||లేచి||

2    ప్రభువు దూత పరము నుండి
    త్వరగ దిగి రాతిని దొర్లించి
    భళిర దానిపై గూర్చుండె
    భయము నొంద కావలి వారు   ||లేచి||

3    ప్రొద్దు పొడవకముందె  స్త్రీలు
    సిద్ధపరచిన సుగంధములు
    శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
    రుద్దుదామని వచ్చిచూడ        ||లేచి||

4    చూడ వెళ్ళిన స్త్రీలను దూత
    చూచి యిపుడు వారి తోడ
    లేడు గలిలయ ముందుగా పోతున్నాడు 
    అప్పుడే లేచినాడనె          ||లేచి||

5    చచ్చిపోయి లేచినాడు
    స్వామి భక్తుల కగుపడినాడు
    చచ్చినను నను లేపుతాడు
    చావు అంటే భయపడరాదు    ||లేచి||

6    నేను చేసే పనుల నెరుగు
    నేను నడిచే మార్గ మెరుగు
    నేను జెప్పిన మాట లెరుగు
    నేను బ్రతికే బ్రతుకు నెరుగు    ||లేచి||

7    నేను లేచిన యేసునందు
    మానకను మది నమ్ముకొందు
    తాను నాలో నుండి నందున
    దయను జేర్చును మోక్షమందు ||లేచి||

No comments:

Post a Comment