Friday, 25 December 2015

త్రాహిమాం క్రీస్తు నాథా

    త్రాహిమాం క్రీస్తు నాథా
    దయఁజూడ రావే - నేను    
    దేహీయనుచు నీ పాదములే 
    దిక్కుగా ఁజేరితిని పుడు        

1.    గవ్వ చేయరాని చెడ్డ    
    కర్మేంద్రియాధీనుడనై
    రవ్వపాలైనేనెంతో నెవ్వబొందితిఁ 
    త్రవ్వుచున్న కొలదిఁ పెరుఁగుఁ 
    దరగదు నా పాప రాశి
    యివ్విధమునఁ జెడిపోతినినే
    నేమి సేతు నోహో హోహో    ||త్రాహి||

2.    నీ యందు భయభక్తులు లేని - 
    నిర్లజ్జాచిత్తముఁబూని
    చేయరాని దుష్కర్మముల - చేసినాఁడను 
    దయ్యాలరాజు చేతిలోఁ
    జేయివేసి వాని పనులఁజేయసాగినే 
    నిబ్బంగి - జెడిపోయితినే
    నయ్యయ్యయ్యొ       ||త్రాహి||

3.    నిబ్బర మొక్కించుకైన
    నిజము రవ్వంతైన లేక
    దబ్బర లాడుటకు ము-త్తాత నైతిని 
    అబ్బురమైన ఘోర పా-పాంధకార 
    కూపమందు
    దబ్బున బడిపోతినయ్యో
    దారి చెడి నేనబ్బబ్బబ్బా       ||త్రాహి||

4.    నిన్నుఁజేరి సాటిలేని నిత్యానంద 
    మందఁబోవు చున్నప్పుడు
    నిందలు నా -కెన్ని చేరినా 
    విన్నదము లేకుండ 
    నీవే నా మదికి ధైర్యమిచ్చియన్నిట 
    రక్షించితివి నా 
    యన్న నీకు స్తోత్రమహహా     ||త్రాహి||

No comments:

Post a Comment