Friday, 25 December 2015

ఎల్లప్పుడు స్తుతించు - నా యాత్మ

    ఎల్లప్పుడు స్తుతించు - నా యాత్మ 
    దేవుని ఎల్లప్పుడు స్తుతించు       
    ఇన్నాళ్ళ వరకు - దేవుడు చేసిన(2)
    ఎన్నలేని మేళ్ళన్‌     మరువకుండ నీవు   

1.    నీ పాపంబులన్నియు - క్షమియించి 
    మరచి నీ పాపంబులన్నియు
    నాశనకరంబైన వ్యాధిన్‌ తొలగించె (2)
    పృధివిన్‌ చూపిన ఇట్టి ప్రేమ నెంచి 
2.    ఎంత కృప జూపెను-నీ బ్రతుకునందు 
    ఎంత కృప జూపెను
    నిత్యము-నీ తలపై కిరీటముంచి (2)
    చావకుండ నీదు ప్రాణంబున్‌ కాపాడె 
3.    మేలుతో - నీ నోటిని  
    తృప్తి పరచెను మేలుతో - నీ నోటిని 
    పక్షిరాజువలె నీదు యౌవనమున్‌ (2)
    క్రొత్తదగుచుండు నట్లుగ జేసెను  

4.    భూమికి - ఆకాశము - యెంత 
    దూరమున్నదో భూమికి - ఆకాశము
    ఆయన-యందు-భయభక్తులున్నట్టి(2)
    వారియెడ నంత - కృపనధికంబు  

5.    మన్నింపు మహిమయు 
    మన దేవుడిచ్చును మన్నింపు 
    మహిమయు
    తూర్పునకు-పడమరకెంత దూరమో(2)
    నీ పాపంబులట్లు దూరంబు జేసెగా 

6.    తండ్రి జాలి పడడా?
    తన పిల్లలయందు తండ్రి జాలి పడడా?
    నీవు రక్షకుని - నమ్ముకొనినచో (2)
    ముదిమి వరకు - నిన్నెత్తి కొనును

No comments:

Post a Comment