Sunday, 27 December 2015

దేవ దేవుని సన్నిధిలో

    దేవ దేవుని సన్నిధిలో
    సముహముగా ఉన్నదెవరో
    అధిపతి ప్రభు యేసుని సైన్యములో
    నిలచిన ఈ ధీరులెవరో (2)     ||దేవ||

1    ఒక్క తలాంతో రెండు ఉన్నవో
    ఐదు ఉన్నను వాడినవారు
    చిన్న పనిలో పెద్ద పనిలో
    ఇచ్చినట్టి పనిని చేసినవారు    ||దేవ||

2    అడవులలో పయనించి
    ప్రభుని ప్రేమ పంచినవారు
    కలిమిలోను లేమిలోను
    పట్టుదలగా ప్రార్థించువారు    ||దేవ||

3    ఒంటరితనం పేదరికంలో
    లాజరులా నిలబడిరి
    యాచించిన పోషించిన
    విశ్వాసము వీడనివారు        ||దేవ||

4.    జాతులన్నియు గోత్రాలన్నియు
    భాషలన్నియు మాట్లాడువారు
    సిలువ క్రింద యేసు రక్తంలో
    మంచి పోరాటం పోరాడినారు  ||దేవ||

2 comments: