Sunday, 27 December 2015

నీ జీవితములో గమ్యంబు ఏదో

    నీ జీవితములో గమ్యంబు ఏదో
    ఒకసారి యోచించవా
    ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు
    నీ హృదయ మర్పించవా            ||నీ||

1  నీ తల్లి గర్భమున నీ వుండినపుడే
    నిను చూచె ప్రభు కన్నులు
    యోచించినావా ఏ రీతి నిన్ను
    నిర్మించె తన చేతులు           ||నీ||

2  నీలోన తాను నివసింపగోరి
    దినమెల్ల చేజాచెను
    హృదయంబు తలుపు తెరువంగ లేవా 
    యేసు ప్రవేశింపను             ||నీ||

3  తన చేతులందు రుధిరంపు ధారల్‌ 
    స్రవియించె నీ కోసమే
    భరియించె శిక్ష నీ కోసమేగా
    ఒకసారి గమనించవా           ||నీ||

4  ప్రభుయేసు నిన్ను సంధించునట్టి  
    సమయంబు ఈనాడెగా
    ఈ చోటనుండి ప్రభు యేసు లేక 
    పోబోకుమో సోదరీ           ||నీ||

No comments:

Post a Comment