Sunday, 27 December 2015

దొరుకుతావురా సహోదరా!

    దొరుకుతావురా సహోదరా! 
    దొరుకుతావురా - నీవు 
    తరిమి తరిమి కీడు చేయ
    పరుగులెత్తిన గాని తుదకు   

1  చిన్న చూపుచూచి తమ్ముని
    కన్నెరుంగక చంపినగాని
    అన్న కయీను దేవుని
    హస్తమునకు దొరికినరీతిగా        ||దొరు||

2. వరములొందిన తమ్ముని జంప
    వలయునని పంతము పగబట్టి   
    నరకవచ్చి లోబడి ఏడ్చిన
    దురిత చరితుని ఏశావువలె    ||దొరు||

3  విగ్రహమునకు మ్రొక్కనిదైవ
    పిల్లల నగ్నిలో పడవైచి
    ఆగ్రహించిన నెబుకద్నెజరు
    గడ్డి మేసి దొరికిన విధముగ   ||దొరు||

4  చెడుగుచేసి పరులు దానిని
    చేసినారని చెప్పియున్న 
    వడిగ దేవుని న్యాయమనెడి
    పరమ త్రాసులో నిలువబడి   ||దొరు||

No comments:

Post a Comment