Sunday, 27 December 2015

ఇశ్రాయేలు సైన్యములకు

    ఇశ్రాయేలు సైన్యములకు
    ముందు నడిచినదైవమా
    నేడు మాతోకూడ నుండి
    మమ్ము నడిపించుము   

1.  సొలోమోను దేవాలయములో    
    మేఘమురాగనే
    యాజకులు నీతేజో మహిమకు 
    నిలువలేకపోయిరి          ||ఇశ్రా||

2. పూర్వపు ప్రవక్తలతో
    నరుల రక్షణ ప్రకటించి
    నన్ను వెదకెడు వారికి
    దొరికెద నంటివి                ||ఇశ్రా||

3. నరుల యందు నీదు ప్రేమ
    క్రీస్తు ద్వారా బయలుపరచి 
    సిల్వరక్తముచేత మమ్ము
    రక్షించియుంటివి                ||ఇశ్రా||

4. ఆది యపోస్తలులపై
    నీ యాత్మ వర్షము కుమ్మరించి
    నట్లు మాపై కుమ్మరించి
    మమ్మునడిపించుము        ||ఇశ్రా||

No comments:

Post a Comment