Friday, 25 December 2015

మనకై యేసు-మరణించె

    మనకై యేసు-మరణించె
    మన పాపముల కొరకే
    నిత్య జీవము నిచ్చుటకే
    సత్యుండు సజీవుడాయె

1    తృణీకరింపబడె
    విసర్జింపబడెను   
    దుఃఖాక్రాంతుడాయె
    వ్యసనముల భరించెను       ||మనకై||

2    మన వ్యసనముల వహించెన్‌
    మన దుఃఖముల భరించెన్‌
    మన మెన్నిక  చేయకయే
    మన ముఖముల ద్రిప్పితిమి  ||మనకై||

3    మన యతిక్రమముల కొరకు
    మన దోషముల కొరకు
    మన నాథుడు శిక్ష నొందె
    మనకు స్వస్థత కలిగె       ||మనకై||

4    గొఱ్ఱెలవలె తప్పితిమి
    పరుగిడితిమి మన దారిన్‌
    అరుదెంచె కాపరియై
    అర్పించె ప్రాణమును         ||మనకై||

5    దౌర్జన్యము నొందెను
    బాధింపబడెను
    తన నోరు తెరువలేదు
    మనకై క్రయధన మీయన్‌   ||మనకై||

6    ఎదిరింప లేదెవరిన్‌
    లేదే కపటము నోట
    యెహోవా నలుగగొట్టెన్‌
    మహా వ్యాధిని కలిగించెన్‌    ||మనకై||

7    సిలువలో వ్రేలాడెన్‌
    సమాధిలో నుండెను
    సజీవుండై లేచెన్‌
    స్తోత్రము హల్లెలూయ        ||మనకై||

24 comments:

  1. Praise the lord....... 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Very painful song

    ReplyDelete
  3. Wonderfully song

    ReplyDelete
  4. Meaning full song

    ReplyDelete
  5. Praise the lord

    ReplyDelete
  6. Praise the lord

    ReplyDelete
  7. Beautiful, we sing this song in our Church worship

    ReplyDelete
  8. Praise the lord 🙌

    ReplyDelete
  9. Praise the lord

    ReplyDelete
  10. Good Song... Praise the LORD

    ReplyDelete
  11. Super song 🙇🙇

    ReplyDelete
  12. దేవునికి సొత్రము కలుగునుగాక

    ReplyDelete
  13. This is pastor Emmanuel
    Lyrics are heart melting

    ReplyDelete
  14. వండర్ఫుల్ లిరిక్స్

    ReplyDelete
  15. Amen amen amen 🙏 praise God

    ReplyDelete
  16. 27 march 2026 at 10:42 praise the lord 🙏🙏

    ReplyDelete