Friday, 25 December 2015

కుమ్మరీ ఓ కుమ్మరీ...

    కుమ్మరీ ఓ కుమ్మరీ... 
    జగదుత్పత్తిదారీ...   
    జిగట మన్నయిన నా వంక
    చల్లగ చూడుమయా      ||కుమ్మరీ||

1.    పనికి రాని పాత్రననీ-పారవేయకుమా
    పొంగి పొరలు పాత్రగచేసి-నన్ను నింపుమా
    సువార్తలోని పాత్రలన్నీ
    శ్రీ యేసునే పొగడుచుండ 
    సాక్షిగ నుండు పాత్రగ జేసి
    సత్యముతో నింపుము తండ్రీ||కుమ్మరీ||

2.    విలువలేని పాత్రను నేను
    కొనువారు లేరెవ్వరూ   
    వెలలేని నీదు రక్తంబుతో
    వెలుగొందు పాత్రగ జేసి
    ఆటంకములనుండి తప్పించి నన్ను
    ఎల్లప్పుడు కావుమయ్యా   
    పగిలియున్న పాత్రను నేను
    సరిచేసి వాడుమయ్యా      ||కుమ్మరీ||

3    లోకాశలతో నిండి ఉప్పొంగుచు 
    మార్గంబు నే తప్పితిన్‌
    మనుషేచ్ఛలన్నియును స్థిరమనుచునే
    మనశ్శాంతి కోల్పోతిని
    పోగొట్టుకున్న పాత్ర యనుచు
    పరుగెత్తి నిను పట్టితి
    ప్రాణంబు నాలో నున్నప్పుడే
    నీ పాదంబుల్‌ నే బట్టితిన్‌  ||కుమ్మరీ||

No comments:

Post a Comment