Friday, 25 December 2015

యేసు-అనుభవించితివా సిలువను

    యేసు-అనుభవించితివా సిలువను 
    కలువరి మెట్టపై
    పలుమారు శ్రమలను  
    అనుభవించితివా-నా యేసు  ||యేసు||

1    ప్రభో - పలుమారు నిన్నునే గొట్టితి 
    వలదని చెప్పిన - వినక నే జేసితి 
    పలునిందలు మోపితి - నీ మీద ||యేసు||

2    నీదు - పవిత్ర మోము పైనే నిన్ను 
    నాదు ఉమ్మివేసి - హద్దు లేక జేసి 
    నీచపర్చితినయ్యా - నా యేసు ||యేసు||

3    కృప - తో నిండి వచ్చిన నిన్నునే
    కాలు చేతులు గట్టి-సీలలతో గొట్టి
    మెట్టపై బెట్టితి - నేనిన్ను       ||యేసు||

4    ప్రేమ - తో నిండి వచ్చిన నిన్నునే
    నాదు చెడు తలంపులతో
    నీదు శిరస్సుపైని
    ముల్లుల కిరీటము గొట్టితిని ||యేసు||

5    మేళ్ళ - తో నిండి వచ్చిన నిన్నునే
    నాదు చెడు నడతలతో నీదు ప్రక్కలోన 
    బళ్ళెంపు పోటును బొడిచితిని ||యేసు||

6    ఇన్ని - చేసినగాని నన్ను నీవు
    చేపట్టి బుజ్జగించితివయ్యా నా తండ్రి 
    నాకు తెలియకున్నది - నీ ప్రేమ ||యే||

No comments:

Post a Comment