Friday, 25 December 2015

సర్వకృపానిధియగు ప్రభువా

1.    సర్వకృపానిధియగు ప్రభువా
    సకల చరాచర సంతోషమా
    స్తోత్రము చేసి స్తుతించెదను
    సంతసముగ నిను పొగడెదను    
    హల్లెలూయా హల్లెలూయా        
    హల్లెలూయా యనిపాడెదను   
    ఆనందముతో సాగెదను

2.    ప్రేమించి నన్ను వెదకితివి
    ప్రీతితో నను రక్షించితివి
    పరిశుద్ధముగ జీవించుటకై 
    పాపిని నను కరుణించితివి          ||హ||

3.    అల్పకాల శ్రమలనుభవింప
    అనుదినము కృపనిచ్చితివి
    నాథుని అడుగు జాడలలో
    నడచుటకు నన్ను పిలిచితివి     ||హ||

4.    మరణ శరీరము మార్పునొంది
    మహిమ శరీరము పొందుటకై  
    మహిమాత్మతో నను నింపితివి   
    మరణ భయములను తీర్చితివి   ||హ||

5.    భువినుండి శ్రేష్టఫలముగను
    దేవునికి నిత్య స్వాస్థ్యముగా 
    భూజనములలో నుండి నను 
    ప్రేమించి క్రయధనమిచ్చితివి     ||హ||

6.    ఎవరు పాడని గీతమును
    యేసుని గూర్చి పాడుటకై
    హేతువు లేకయే ప్రేమించెను
    యేసుకు నేనేమివ్వగలను          ||హ||

No comments:

Post a Comment