Friday, 25 December 2015

రండీ రండీ యేసుని యొద్దకు

    రండీ రండీ యేసుని యొద్దకు
    రమ్మనుచున్నాడు
    ప్రయాసపడి భారము మోయువారలు 
    ప్రభుని చెంతకు పరుగిడి వేగమె

1     యేసుని పిలుపు వినియు నింక
    యోచింపరేల? 
    అవనిలో అగచాట్ల  పాలైన
    అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి||

2    కరవు మరణము రణముల జూచి
    కలుగదు మారుమనసు 
    ప్రవచనములు సంపూర్ణములాయెను 
    యూదులు తిరిగి వచ్చియున్నారు 

3    ప్రభు యేసు నీ కొరకై తనదు
    ప్రాణము నిచ్చెగదా
    సిలువను రక్తము చిందించియును
    బలియాయెను యా ఘనుడు మనకై          

4    యేసుని నామము నందే
    పరమ నివాసము దొరుకును
    ముక్తిని     పాప విమోచనమును
    శక్తిమంతుడు యేసేయిచ్చును               

5    నేనే మార్గము నేనే సత్యము
    నేనే జీవమును
    నేనే గాకింకెవ్వరు లేరని
    యెంచి చెప్పిన యేసుని యొద్దకు                      

6    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయామెన్‌
    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయా హల్లెలూయా 

No comments:

Post a Comment