Sunday, 27 December 2015

నీవు చేసిన ఉపకారములకు

     నీవు చేసిన ఉపకారములకు
     నేనేమి చెల్లింతును
     ఏడాది దూడలనా - వేలాది పొట్టేళ్ళనా

1.  వేలాది నదులంత విస్తారతైలము     
     నీకిచ్చినా చాలునా
     గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని
     నీకిచ్చినా చాలునా          ||నీవు||

2.  మరణ పాత్రుడనైయున్న నాకై
     మరణించితివి సిలువలో
     కరుణ చూపి నీ దివ్య మార్గాన
     నడిపించుమో యేసయ్యా   ||నీవు||

3.  విరిగి నలిగిన బలియాగముగను
     నా హృదయమర్పింతును    
     రక్షణ పాత్రను చేబూని నిత్యము
     నిను వెంబడించెదను          ||నీవు||

4.  ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
     నేనేమి చెల్లింతును
     కపట మనస్సు లేకుండ హృదయాన్ని
     నీకిచ్చినా చాలునా          ||నీవు||

1 comment: