Sunday, 27 December 2015

పరమ జీవము నాకు నివ్వ...

1. పరమ జీవము నాకు నివ్వ...
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును
  
    యేసు చాలును
    యేసు చాలును
    యే సమయమైన యే స్థితికైనా
    నా జీవితములో యేసు చాలును

2. సాతాను శోధన లధికమైన
    సొమ్మసిల్లక సాగి వెళ్లెదను
    లోకము శరీరము లాగినను
    లోబడక నేను వెళ్ళెదను         ||యేసు||

3. పచ్చిక బయలులో పరుండ జేయున్‌
    శాంతి జలము చెంత నడిపించును
    అనిశము ప్రాణము తృప్తిపరచున్‌
    మరణలోయలో నన్ను కాపాడును        ||యేసు||

4. నరులెల్లరు నన్ను విడిచినను
    శరీరము కుళ్ళి కృశించినను
    హరించినన్‌ నా ఐశ్వర్యము
    విరోధివలె నను విడిచినను                     ||యేసు||

No comments:

Post a Comment