Sunday, 27 December 2015

ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ

    ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ
    మరణము కంటె-బలమైన ప్రేమది
    నన్ను జయించె నీ ప్రేమ     

1. పరమును వీడిన ప్రేమ, ధరలో
    పాపిని వెదకిన ప్రేమ
    నన్ను కరుణించీ, ఆదరించీ, సేదదీర్చే
    నిత్య జీవమిచ్చే     ||ఆశ్చర్య||

2. పావన యేసుని ప్రేమ, సిలువలో
    పాపిని మోసిన ప్రేమ
    నాకై మరణించి, జీవమిచ్చీ, జయమిచ్చే 
    తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్య||

3. నా స్థితి జూసిన ప్రేమ, నాపై
    జాలిని చూపిన ప్రేమ
    నాకై పరుగెత్తి కౌగలించీ ముద్దాడె
    కన్నీటిని తుడిచె       ||ఆశ్చర్య||

4. శ్రమను సహించిన ప్రేమ, నాకై
    శాపము నోర్చిన ప్రేమ
    నను విడనాడనీ యెడబాయనీ
    ప్రేమదీ వాడబారదు    ||ఆశ్చర్య||

1 comment:

  1. క్రీస్తు ప్రభువు ప్రేమను అద్భుతంగా చాటే నా చిన్ననాటి , మరియు ఈనాటి ప్రియమైన గీతం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఇంత గొప్ప అద్భుతమైన గీతాన్ని రచించిన రచయితకు క్రీస్తు ప్రభువు నామంలో హృదయపూర్వక వందనములు
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

    ReplyDelete