Sunday, 27 December 2015

ప్రతిక్షణం స్తుతియించెద

1    ప్రతిక్షణం స్తుతియించెద
    ప్రభుయేసు ప్రేమ ఘనత
    ప్రతి  దినము కొనియాడెద
    ప్రభు  యేసు దివ్యచరిత
    ప్రతి నోట పాడాలి
    ఒక చక్కని తియ్యనిపాట 
    ప్రతి చోట పాడాలి
    ప్రభుమేలుల గూర్చి
    ఓ...దేవ మహాదేవ-నీకె స్తోత్రము
    సంపూర్ణ హృదయంతో
    ధ్యానించెదం
    ఓ దేవ మహరాజ-నీకే చెల్లును ||ప్రతి||

2.    మరణదూత మమ్ములను
    వెంటాడగా దరిచేర కరముచాచి    
    కాపాడిన దేవా
    మా బ్రతుకుల జీవమిచ్చి
    బ్రతికించగా స్తుతి
    నీకె అర్పింతుము

3.    మనుజునిగ అరుదెంచిన 
    మహిమతేజుడా కొనియాడ 
    తరముగాదు
    నీదు ప్రేమను మా రక్షణకై నీదు    
    రక్తమిచ్చినావు
    స్తుతి నీకె అర్పింతుము

No comments:

Post a Comment