Friday, 25 December 2015

ఎందుకో నన్నింతగా నీవు

    ఎందుకో నన్నింతగా నీవు
    ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర
    హల్లెలూయ యేసయ్య    ||ఎందుకో||

1.    నా పాపము బాప
    నరరూపివైనావు
    నా శాపము బాప
    నలిగి వ్రేలాడితివి 
    నాకు చాలిన
    దేవుడవు నీవే
    నా స్థానములో నీవే     ||ఎందుకో||

2.    నీ రూపము నాలో
    నిర్మించియున్నావు
    నీ పోలికలోనే
    నివసించుచున్నాను 
    నీవు నన్ను యెన్నుకున్నావు
    నీ కొరకే నీ కృపలో    ||ఎందుకో||

3.    నా శ్రమలు సహించి
    నా ఆశ్రయమైనావు 
    నా వ్యధలు భరించి
    నన్నాదుకొన్నావు 
    నన్ను నీలో చూచుకున్నావు
    నన్ను దాచియున్నావు    ||ఎందుకో||

4.    నీ సన్నిధి నాలో
    నా సర్వము నీలో   
    నీ సంపద నాలో
    నా సంతసము నీలో 
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనందువే    ||ఎందుకో||

5.    నా మనవులు ముందే
    నీ మనస్సులో నెరవేరె
    నా మనుగడ ముందే
    నీ గ్రంథములో నుండె
    ఏమి అద్భుత ప్రేమ-సంకల్పం
    నేనేమి చెల్లింతు    ||ఎందుకో||

No comments:

Post a Comment