Friday, 25 December 2015

సుందర పరమదేవ కుమారుడైన

    సుందర పరమదేవ కుమారుడైన
    యేసుక్రీస్తున్‌
    స్తోత్రించి పొగడి నిత్యం కొనియాడెదం
    అందలం భువికి తెచ్చి
    ప్రాణమును ధారబోసెను
    ఆదరించి మమ్ములను ఐక్యపర్చెన్‌
    ఆత్మను కుమ్మరించెన్‌
    కృపలతో నాదరించెన్‌-స్తుతి      ||స్తు||

1.    పాపకూపమున పడి
    పాప శాపము నొందిన
    పాపులను రక్షింపను ప్రాణమిచ్చెను
    దేవుని కిష్టులైన ప్రజలుగ మార్చిన
    మెస్సయ్యాను విశ్వసించు భక్తులార 
    నీతిపరుడైన న్యాయాధిపతి
    పాదముల చేరుడి, పశ్చాత్తాపమొందుడి
    జయోత్సవం చేయుడి
    స్తుతి చెప్పి పాడుడి-పాడుడియంచు ||స్తు||

2.    ఆకాశపు జ్యోతులన్ని
    లెక్కలేని దూతసైన్యం
    అద్భుతముగ క్రీస్తును ఆరాధించిరి
    మంటిలోని జాతులన్ని
    శ్రేష్టమైన వస్తువులన్ని
    శక్తిమంతుడని స్తుతి  పాడి పొగడిరి
    అందరికి తండ్రి యొకే
    పావన కుమారుని కీర్తించను
    పాదములు మ్రొక్కను
    అనేకులు చేరను - స్తుతి గీతి 
    పాడుడి - పాడుడి యంచు     ||స్తు||

3.    రాజులు జ్ఞానులు మేధావులు 
    యందరును
    కలసి కృపతో జీవించుచుండగాను
    ఏ ప్రాంతభక్తులైన
    విశ్వాసులందరును
    సమాధానంతో జీవించుచుండగా
    సద్బోధకులు సత్యసంఘములు
    లేచి జీవించిన
    సైతాన్‌ పారిపోవును
    జయం మనది యగును యని
    పాడి పాడుడి - పాడుడి యంచు ||స్తు||

1 comment: