Friday, 25 December 2015

ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల

    ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల
    ప్రభుయేసు సిలువ నుండి 
    ప్రవహించుధార
    పవిత్రమై-పరిశుద్ధమై
    ప్రవహించు జీవధార             

1    మౌన ప్రార్థన-మోకాటి ప్రార్థన
    కన్నీటి ప్రార్థన-ఉపవాస ప్రార్థన
    సిలువ శక్తితో-విలువైన భక్తితో
    సిలువ సాక్షిగా-శ్రీయేసు సాక్షిగా ||ఇది||

2    విశ్వాసఘాతకుల్‌-విద్రోహ చర్యలు
    విచిత్ర మనుజుల-విషమైన  మనసులు
    సాతాను యుక్తులు-సహించి నేటికి
    సాగిపోతుంది-సజీవసాక్షిగా     ||ఇది||

3     ఎల్లలు దాటింది శ్రీ యేసు సువార్త
    ఎంత ప్రయాణం-ఎంతెంత దూరము
    ఎన్ని మేలులు-ఎన్నెన్ని దీవెనల్‌
    పొందినవారంతా-దీవించబడితిరి ||ఇది||

4    లేచి తేజరిల్లింది ప్రభు సహవాసం
    ఒంటరి వాడయ్యాడు వేలమందిగా
    ఎండిన భూమిపై జీవజలములు
    దప్పిక గలవారిపై కుమ్మరించాడు ||ఇది||

No comments:

Post a Comment