Friday, 25 December 2015

పరదేశులమో ప్రియులారా

    పరదేశులమో ప్రియులారా
    మన-పుర మిదిగా దెపుడు
    నిజముగ         ||పర||

1    చిత్ర వస్తువులు-చెల్లెడి యొక 
    వి-చిత్రమైన సంత-లోకము     ||పర||

2    సంత గొల్లు క్షమ-సడలిన చందం
    బంతయు సద్దణగున్‌ నిజముగ ||పర||

3    మాయలోక మిది-ఛాయను బోలును 
    మాయ మాయ మాయ-అంతయు
4    స్థిరమని నమ్మకు-ధర యెవ్వరికిని 
    పరలోకమె స్థిరము-నిజముగ   ||పర||

5    మేడలు మిద్దెలు-మేలగు సరకులు
    పాడై కనబడవే-నిజముగ          ||పర||

6    ధనధాన్యంబులు-దరగక మానవు
    పనిపాటులు పోయె నిజముగ  ||పర||

7    వచ్చితి మిచటికి-వట్టి హస్తముల
    దెచ్చిన దేదియు లేదు గదా     ||పర||

8    ఎట్లు వచ్చితిమి-యీ లోకమునకు
    అట్లు వెళ్ళవలయున్‌-మింటికి  ||పర||

9    యేసు నందు వి-శ్వాసం బుంచిన
    వాసిగ నిను జేర్చున్‌-బరమున  ||పర||

10    యేసే మార్గము-యేసే సత్యము
    యేసే జీవముగా-నిజముగ     ||పర||

1 comment: