ఆహా మహాత్మ హా శరణ్య
హా విమోచకా దోషరహిత
చంపెనిను నా - దోషమేగదా
1 వీరలను క్షమించుతండ్రి
నేర మేమియున్ కోరి తిటులు
నిన్ను జంపు కృార జనులకై||ఆహా||
2. ''నీవు నాతో బరదైసున
నేడే యుందువు''
పావనుండ ఇట్లు బలికి
పాపిగాచితివి ||ఆహా||
3. అమ్మా! నీ సుతుడటంచు
మరి-యమ్మతో బలికి
క్రమ్మర 'నీ జనని' యంచు
గర్త నుడివితి ||ఆహా||
4. నా దేవా నా దేవా యేమి విడ
నాడితివనుచు
శ్రీ దేవసుతా పలికితివి శ్రమ
చెప్పక శక్యమా ||ఆహా||
5 దప్పిగొనుచున్నాన టంచు
జెప్పితివి గదా
ఇప్పగిదిని బాధనొంద
నేమి నీకు హా ||ఆహా||
6 శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తి
హా సమాప్తమై నదంచు తెలిపి
సమసితివి గదా ||ఆహా||
7 అప్పగింతు దండ్రి,
నీకు-నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు
చేసి కూలిపోతివా ||ఆహా||
హా విమోచకా దోషరహిత
చంపెనిను నా - దోషమేగదా
1 వీరలను క్షమించుతండ్రి
నేర మేమియున్ కోరి తిటులు
నిన్ను జంపు కృార జనులకై||ఆహా||
2. ''నీవు నాతో బరదైసున
నేడే యుందువు''
పావనుండ ఇట్లు బలికి
పాపిగాచితివి ||ఆహా||
3. అమ్మా! నీ సుతుడటంచు
మరి-యమ్మతో బలికి
క్రమ్మర 'నీ జనని' యంచు
గర్త నుడివితి ||ఆహా||
4. నా దేవా నా దేవా యేమి విడ
నాడితివనుచు
శ్రీ దేవసుతా పలికితివి శ్రమ
చెప్పక శక్యమా ||ఆహా||
5 దప్పిగొనుచున్నాన టంచు
జెప్పితివి గదా
ఇప్పగిదిని బాధనొంద
నేమి నీకు హా ||ఆహా||
6 శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తి
హా సమాప్తమై నదంచు తెలిపి
సమసితివి గదా ||ఆహా||
7 అప్పగింతు దండ్రి,
నీకు-నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు
చేసి కూలిపోతివా ||ఆహా||
No comments:
Post a Comment