Friday, 25 December 2015

చూచుచున్నాము నీవైపు

    చూచుచున్నాము నీవైపు
    మా ప్రియ జనక
    చూచుచున్నాము నీవైపు
    చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను
    జాఁచుచుఁ గరములు-చక్కఁగా నీవైపు

1.    మే మరులమై యుంటిమి
    మార్గము వీడి మేమందరము పోతిమి
    ప్రేమచేనప్పుడు ప్రియతనయు     
    నంపించి క్షేమమార్గము మాకు
    బ్రేమను జూపితివి      ||చూచు||

2.    నిను నమ్ము పాపులకు వారెవరైన
    నీ శరణుజొచ్చు వారలకు
    ఇనుఁడపు కేడెంబు
    నీ జగతిలో నగుచు ఁగనుపరచుచుందువు
    ఘనమైన నీ కృపఁ      ||చూచు||

3.    నీ భయము మాయెదలను
    నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను
    నీ భయముచే మేము వైభవ     
    మొందుచు నే భయము లేకుండ
    నీ భువిని గొన్నాళ్ళు       ||చూచు||

4.    దయఁజూచి మము నెప్పుడు
    మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు
    దయచేయరానివి దయచేయుమని
    కోరఁదయజూపి మన్నించు
    దయగల మా తండ్రి       ||చూచు||

No comments:

Post a Comment