Friday, 25 December 2015

సిలువలో బలియైన

    సిలువలో బలియైన
    దేవుని గొఱ్ఱెపిల్ల
    విలువైన నీ ప్రేమన్‌
    వివరింతు శ్రీ యేసు

1    ఆనాటి యూదులే
    నిను జంపిరనుకొంటి
    కాదు కాదయ్యయ్యో
    నా పాప ఋణమునకే     ||సిలువ||

2    నాయతి క్రమములకై
    నలుగ గొట్టబడి
    నా దోషముల నీవు
    ప్రియముగను మోసితివా    ||సిలువ||

3    మృదువైన నీ నుదురు
    ముండ్ల పోట్లచేత
    సురూపమును లేక
    సోలిపోతివా ప్రియుడా    ||సిలువ||

4    నా రోగములు నీపై
    నమ్రతతో భరియించి
    తృణీకరింపబడి
    ప్రాణమర్పించితివి    ||సిలువ||

5    వ్యసనా క్రాంతుడవుగా
    వ్యాధి ననుభవించి
    మౌనము ధరించి
    మరణమైతివా ప్రభువా    ||సిలువ||

6    నా పాప దోషముచే
    నేచచ్చి యుండగనే
    మరణమై నా కొరకు
    మరి తిరిగి లేచితివి    ||సిలువ||

7    పరమున కెత్తబడిన 
    ప్రియ యేసు రాకడకై
    పదిలముగ కనిపెట్టి
    పాడెదను హల్లెలూయ    ||సిలువ||

1 comment: