అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు
నాలో నుండగా
ఊహించలేని ఆశ్చర్యక్రియలతో
నా దేవుడు నన్ను నడిపించును.
సాధ్యమే అన్ని సాద్యమే
నా యేసు తోడైయుండగా(2)
2.శోధన శ్రమలు వచ్చినను,
ఏమాత్రము నేను వెనుదిరుగను
సత్యస్వరూపి సర్వోన్నతుడైన
గొప్పదేవుడు నన్ను బలపరుచును“సాధ్యమే”
3.సాతాను శక్తులు ఎదురు నిలచిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చెను.“సాధ్యమే”
Amen
ReplyDeleteGod bless you brother
ReplyDelete