ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళి వంటి - ఎత్తలేని నీటివంటి - స్వల్పమైన దానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం - ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇలా - నీ సంపదలన్నియు
బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను - భువినేలిన రాజులు
నాది నాది నాది అంటూ - విర్రవీగుచున్నావ
చచ్చినాక నీది అన్న దేహమయిన వచ్చునా
మోయలేక బ్రతుకు భారం - మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు - మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం - నడుపు నిన్ను శాంతితో
This is just to keep all songs & Material in one place. Searchable and available.
Friday, 25 December 2015
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment