Friday, 25 December 2015

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

    ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
    చింతలన్ని తీరెనయ్యా-నిన్ను చేరినా
    నా చింతలన్ని తీరెనయ్యా
    నిన్ను చేరినా        ||ఎంత||

1     సంతోషం ఎక్కడ వుందని
    సమాధాన మెచ్చట నాకు దొరికేనని
    జగమంతా వెదికాను
    జనులందరి నడిగాను
    చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||

2     ప్రేమనేది ఎక్కడ ఉందనీ
    క్షమ అనేది ఎచట నాకు దొరికేనని
    బంధువులలో వెతికాను
    స్నేహితులను అడిగాను
    చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||

3     సత్యమనేది ఎక్కడ ఉందనీ
    నిత్య జీవమనేది ఎచట నాకు దొరికేనని
    ఎందరికో మ్రొక్కాను 
    ఏమేమో చేశాను
    చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||

4     నెమ్మదనేది ఎక్కడ ఉందని
    శాంతనేది ఎక్కడ నాకు దొరికేనని
    దిశలన్ని తిరిగాను
    యాత్రలెన్నో చేశాను
    చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||

1 comment: