Friday, 25 December 2015

యేసుని ప్రేమను - నేమారకను

    యేసుని ప్రేమను - నేమారకను
    నెప్పుడు దలచవె యో మనసా
    వాసిగ నాతని - వరనామంబును
    వదలక పొగడవె యో మనసా 

1    పాపుల కొరకై - ప్రాణము బెట్టిన
    ప్రభు నిల దలచవె యో మనసా
    శాపము నంతయు - జక్కగ నోర్చిన
    శాంతుని పొగడవె యో మనసా 

2    కష్టములలో మన - కండగ నుండిన 
    కర్తను దలచవె యో మనసా
    నష్టములన్నియు - నణచిన
    యా గురు శ్రేష్టుని పొగడవె యో మనసా
3    మరణతరిని మన - శరణుగ నుండెడు 
    మాన్యుని దలచవె యో మనసా
    కరుణను మన క - న్నీటిని దుడిచిన
    కర్తను పొగడవె యో మనసా   

4    ప్రార్థనలు విని - ఫలముల నొసగిన
    ప్రభునిక దలచవె యో మనసా
    వర్ధన గోరుచు - శ్రద్ధతో దిద్దిన
    వంద్యుని పొగడవె యో మనసా
5    వంచన లేక - వరముల నొసగిన 
    వరదుని దలచవె యో మనసా
    కొంచెము కాని - కూర్మితో దేవుని
    కొమరుని పొగడవె యో మనసా

No comments:

Post a Comment